ప్రతిష్టాత్మక ఫార్ములా ఈరేస్‌కు వేదిక కానుంది హైదరాబాద్. దేశంలోనే ఈ రేస్‌కు ఆతిథ్యం ఇస్తున్న తొలి నగరంగా హైదరాబాద్ నిలవగా ఇంందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఫార్ములా E అనేది ఎలక్ట్రిక్ కార్ల కోసం ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఎల్ ఆటోమొబైల్ (FIA) నిర్వహిస్తోన్న సింగిల్-సీటర్ మోటార్‌స్పోర్ట్ ఛాంపియన్‌షిప్.
కొత్త లొకేషన్ల కోసం గ్లోబల్ హంట్‌లో భాగంగా హైదరాబాద్ వేదిక కాగా ఇప్పటివరకు మొనాకో, పారిస్, బెర్లిన్, లండన్, న్యూయార్క్, సియోల్, టోక్యో మరియు రోమ్‌లో ఈ రేస్ జరిగింది. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం 2.8 కి.మీ.ల ట్రాక్‌ని నిర్మించింది. నగరంలోని రోడ్లపై మరియు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దిగువన గంటకు 280 కి.మీ వేగంతో ఫార్ములా EVలు పరుగెత్తడం గ్రేటర్ వాసులు వీక్షించవచ్చు.
ఫార్ములా E మొదటి రేసు 2014లో జరుగగా ఇప్పటివరకు సుమారు 500 మిలియన్ల మంది వీక్షకుల చూశారు. ప్రతిష్టాత్మకమైన మోటార్‌స్పోర్టింగ్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణ ఖ్యాతి ఖండంతారాలకు వ్యాపించిందన్నారు మంత్రి కేటీఆర్. పారిస్, రోమ్, లండన్, హాంకాంగ్, న్యూయార్క్, బెర్లిన్, మొనాకో వంటి 18 నగరాలతో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టామన్నారు. ఈ రేస్‌తో బ్రాండ్ హైదరాబాద్ మరింత పెరగనుంది.
ఇవి కూడా చదవండి..

