ముస్లింలను అణగదొక్కుతున్న కాంగ్రెస్!

4
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో ముస్లింలను రాజకీయంగా తొక్కేసే కుట్ర జరుగుతుంది అన్నారు మైనారిటీ నేత సల్మాన్ ఖాన్. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు HYC సల్మాన్ ఖాన్. ఈ సందర్భంగా మాట్లాడుతూ..2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క మైనారిటీ నాయకుడికి కూడా పదవులు ఇవ్వలేదు అన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని నేను చెప్పగానే, మంత్రులంతా నీకేం కావాలో చెప్పు అని మంతనాలు చేశారు… సెక్యులరిజాన్ని బ్రతికించే బీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది అన్నారు సల్మాన్ ఖాన్.

సీఎం రేవంత్ రెడ్డి మా ఇంటి మీదకి పోలీసులను పంపిండు అని మంత్రి కొండా సురేఖ కూతురు అంది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మంత్రి కొండా సురేఖ నిందితుడిని తీసుకెళ్తుంటే పోలీసులు చేతులు కట్టుకొని చూస్తున్నారు… 2,3 రోజుల తిట్టుకున్నాక తిరిగి రేవంత్ రెడ్డి, కొండా సురేఖ దంపతులు కలిసి శాలువాలు కప్పుకొని స్వీట్లు పెట్టుకున్నారు.. వీళ్లకు సిగ్గుందా అసలు? అని మండిపడ్డారు కేటీఆర్.

రేవంత్ రెడ్డి వల్ల మళ్లీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవదని ఖర్గే గారు గుర్తించినందుకు వారికి ధన్యవాదాలు…ఇలాంటి పనికిమాలిన చెత్త ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు -..శివధర్ రెడ్డి పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, ఓన్లీ ఖాకీ బుక్ అన్నాడుగా ఖాకీ బుక్ కాకి ఎత్తుకుపోయిందా?, రేవంత్ రెడ్డి తుపాకీ ఇస్తే, రోహిన్ రెడ్డి ఆ తుపాకీతో బెదిరించాడు అని స్వయంగా మంత్రి కొండా సురేఖ కూతురు చెప్పింది అని గుర్తు చేశారు.

Also Read:ప్రభాస్-హను రాఘవపూడి..ఫౌజీ

- Advertisement -