ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..

487
huzurnagar
- Advertisement -

నువ్వా నేనా అన్నట్టు సాగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మరి కొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు జరిగే పోరులో విజయం ఎవరిని వరిస్తుందనే అంశంపై మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఉప ఎన్నికలో భాగంగా సోమవారం ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఇందుకు హుజూర్‌నగర్,చింతల పాలెం,మేళ్ల చెరువు,పాలకీడు,మఠంపల్లి,నేరేడు చర్ల,గరిడేపల్లి మండలాలు పోలింగ్‌కు సిద్దమైయ్యాయి. 7 మండలాల పరిధిలో 302 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 1500 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. 3782 ఈవీఎం ల వినియోగంలో ఉంటాయి. హుజూర్‌నగర్ మార్కెట్ యార్డ్‌లో ఈవీఎంలు , మెటీరియల్ పంపిణీ చేస్తారు.ఆదివారం సాయంత్రానికి ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. కాగా ఈ ఎన్నికల్లో 2,36,842 ఓటర్ లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

- Advertisement -