హుజుర్ నగర్ బీజేపీ అభ్యర్ధి ఖరారు…

368
BJP
- Advertisement -

అక్టోబర్ 21న జరిగే హుజుర్ నగర్ ఉప ఎన్నికలకు ఎట్టకేలకు బీజేపీ తమ అభ్యర్ధిని ప్రకటించింది. మొదటగా శ్రీకళారెడ్డి పేరు ప్రకటించినా ఆమె అనుహ్యంగా పోటీ నుంచి తప్పుకుంది. దీంతో మళ్లీ మరోక అభ్యర్ధిని ప్రకటించారు బీజేపీ నేతలు. హుజుర్ నగర్ లో బీజేపీకి పెద్దగా బలం లేకపోవడంతో పోటీ చేయడానికి నేతలు ఆలోచిస్తున్నారు.

నిన్న సాయంత్రం రాష్ట్ర కార్యవర్గ సమావేశం కోట రామారావును హుజూర్ నగర్ అభ్యర్థిగా ఎంపీక చేసింది. కాగా, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ నుంచి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పద్మావతిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. నామినేషన్లకు ఈనెల 30 వరకూ గడువు ఉంది. అక్టోబరు 21న పోలింగ్‌ జరిగి, అదే నెల 24న ఫలితాలు విడుదల కానున్నాయి.

- Advertisement -