శ్రీశైలం ప్రాజెక్ట్..10 గేట్లు ఎత్తివేత

371
srisailam Dam
- Advertisement -

ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తీగా నీటితో నిండు కుండాలా మారింది. ప్రాజెక్ట్ లో నీళ్లు ఎక్కువ అవడంతో దిగువకు వదిలారు అధికారులు. ఈ క్రమంలో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు.

ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.12 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3.48 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.8 అడుగులు. జలాశయం పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 213.8 టీఎంసీలు.

- Advertisement -