బీజేపీపై ప్రజా ఆగ్రహం..ఈటల ఓటమి ఖాయం..!

66
rajender
- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ…కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన పని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ చావుకు వచ్చిపడింది. దసరా కానుకగా కేంద్రంలోని మోదీసర్కార్ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను మరోసారి పెంచి దేశ ప్రజలపై మరింత భారం మోపిన సంగతి తెలిసిందే. తాజా పెంపుతో వంట గ్యాస్ సిలిండర్ ధర 952 రూపాయలకు చేరింది. పెట్రోలో ధర 110 రూపాయలకు చేరువ కాగా..డీజిల్ ధర కూడా సెంచరీ కొట్టింది. దీంతో హుజురాబాద్ ప్రజలు బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా గ్యాస్ సిలిండర్లను బతుకమ్మలతో పాటు పెట్టి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ మహిళలు తమ నిరసన వ్యక్తం చేయడంతో ఈటల వర్గానికి దడ పుట్టిస్తోంది.

ఇప్పటికే యుపీలోని లఖింఖేరీలో జరిగిన కాషాయ హత్యాకాండపై రైతన్నలు బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. ముఖ్యంగా పెరిగిన ధరలతో మహిళలు పూర్తిగా కాషాయ పార్టీని వ్యతిరేకిస్తుండడంతో ఈటల రాజేందర్‌కు కొత్త టెన్షన్ పట్టుకుంది. మరోవైపు మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై విసిగిపోయిన హుజురాబాద్ ప్రజలు ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ తమ ఇండ్లకు రావద్దు అంటూ తమ ఇళ్ల ముందు బోర్డులు పెట్టడంతో బండి బ్యాచ్ బిత్తరపోయింది. తనపై ఉన్న సింపతీతో గెలుస్తానని ధీమాగా ఉన్న ఈటల రాజేందర్‌కు, ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రజల్లో బీజేపీపట్ల పెరుగుతున్న వ్యతిరేకత చూసి కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎక్కడ మోదీపై ఉన్న వ్యతిరేకత తన ఓటమికి దారి తీస్తుందోనని ఈటలకు గుబులు పట్టుకుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ధరల పట్టిక ఇటు ఈటలకు, అటు తెలంగాణ బీజేపీ నేతలకు దిమ్మతిరిగే షాక్ ఇస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ధరలు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ధరలతో పోలుస్తూ ఓ ప్రైస్ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్రోల్ రేటు రూ.60 ఉండగా.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో అది రూ.112కు చేరింది. ఇక డీజిల్ గతంలో రూ.55 ఉండగా.. రూ.100కు చేరింది. ఇక గ్యాస్ సిలిండర్ ధర రూ.414 ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.1000కి చేరువైంది. పెసరపప్పు నాడు రూ.70కి కిలో దొరకగా.. నేడు అది రూ.190కి పెరిగింది. గోధమపిండి నాడు రూ.17 ఉండగా.. నేడు రూ.30 అయ్యింది. నెయ్యి రూ.350 ఉండగా.. ఇప్పుడు డబుల్ పెరిగి 650 అయ్యింది. వంట నూనె నాడు రూ.52కే దొరకగా.. ఇప్పుడు రూ.210కి చేరింది. పాలు రూ.30 ఉండగా 56 అయ్యింది.

కోడి గుడ్డు కాంగ్రెస్ హయాంలో రూ.2 ఉండగా.. రూ.7కు పెరిగింది..ఇలా మోదీ బిఫోర్ ధరలు ఎలా ఉన్నాయి.. మోదీ ఆఫ్టర్ ధరలు ఎలా పెరిగాయో లెక్కలతో సహా చెబుతూ నెట్‌జన్లు ఏకిపారేస్తున్నరు…హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ…సోషల్ మీడియాలో కాంగ్రెస్ అభిమానులు ఈ ధరల పట్టిక వివరాలతో కూడిన పోస్ట్‌ను తెగ వైరల్ చేస్తోంది. టీఆర్ఎస్ అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు కూడా ఈ పోస్ట్‌ను వైరల్ చేస్తూ ధరలు పెంచే బీజేపీకి ఓటేసి మన బతుకులను నాశనం చేసుకుందామా.. సంక్షేమ పథకాలతో పేదవాడికి అండగా నిలిచే టీఆర్ఎస్‌కు ఓటేద్దామా అంటూ హుజురాబాద్‌ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. మొత్తంగా గత ఏడేళ్ల మోదీ హయాంలో పెరిగిన ధరలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్… హుజురాబాద్ బై ఎలక్షన్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు తెగ టెన్షన్ పెట్టిస్తోంది.

- Advertisement -