హుజూరాబాద్ మండల పరిధిలోపి పెద్ద పాపయ్యపల్లెకు చెందిన ముదిరాజ్ కులస్తులు టీఆర్ఎస్ పార్టీకి జైకొట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కే తమ ఓటు అని తీర్మానించారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్‌కు ముదిరాజ్‌లు తమ మద్దతు లేఖ అందజేసి.. సుమారు 100 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి మంత్రి గంగుల గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గట్టు పద్దయ్య, సభ్యులు భిక్షపతి, కొమురయ్య, చిన్న రాజయ్య, రామయ్య, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులు మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో జరగబోయే ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ గెలుపునకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మత్స్యకారులు చాలా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. చేపపిల్లల పంపకంతో పాటు, వలలు, ఆధునిక మరబోట్లు ఇతర సామాగ్రిని అందించి మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ వెంటే ఉంటామని వారు తేల్చిచెప్పారు.