సీఎం కేసీఆర్‌కు ద‌ళితుల అపూర్వ స్వాగ‌తం

126
kcr cm
- Advertisement -

హుజురాబాద్ వేదికగా ఇవాళ సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు కేటాయించడంతో దళితవాడల్లో సంబురాలు అంబరన్నంటుతున్నాయి. అందమైన రంగవల్లులు, డప్పుచ‌ప్పుళ్లు, ఆటపాటలతో తెలంగాణలోని దళిత లోగిళ్లు సరికొత్త ఉషోదయంతో వెలుగులు పంచుకుంటున్నాయి.

చారిత్రాత్మ‌క‌ సందర్భానికి తెరలేపిన దళితోద్ధారకుడు సీఎం కేసీఆర్‌కు ఎల్ల‌వేళ‌లా అండగా ఉంటామ‌ని ద‌ళిత ప‌ల్లెలు శపథం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నలుమూలల నుండి పెద్ద ఎత్తున దళితులు ఈ సభకు తరలివస్తుండగా అన్నివర్గాల నుండి మంచి స్పందన వస్తోంది.

ముందుగా అర్హులైన 15 కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. హుజూరాబాద్‌ నియోజక వర్గంలో ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీలుండగా దళితబంధు కోసం ఒక్కో మండలానికి ఇద్దరిని ఎంపిక చేశారు. మున్సిపాలిటీల నుంచి ముగ్గురిని ఎంపిక చేశారు. ఇక దళిత బంధు కోసం రూ. 500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -