UP:మజ్లిస్‌తో AJUP పొత్తు

7
- Advertisement -

2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJUP) అధ్యక్షుడు హుమాయున్ కబీర్‌… మజ్లిస్‌తో పొత్తును ప్రకటించింది. ఓవైసీని తన “బడా భాయ్” (అన్న)గా పేర్కొంటూ, ఈ కూటమి ఎప్పటికీ విడిపోదని కబీర్ స్పష్టం చేశారు. నా పెద్దన్న అసదుద్దీన్ ఓవైసీ వచ్చారు. మా రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయి అని ఆయన తెలిపారు.

ఈ కూటమి తరఫున సుమారు 182 నుంచి 192 మంది అభ్యర్థులను బుధవారం ప్రకటించనున్నట్లు కబీర్ వెల్లడించారు. ఓవైసీ కూడా తన పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. నేను నా అన్నతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. కనీసం 20 ర్యాలీల్లో ఆయన నా వెంట ఉంటారు అని కబీర్ పేర్కొన్నారు. బెంగాల్‌లోని ముస్లిం సమాజం తమకు మద్దతుగా ఉందని కూడా ఆయన అన్నారు.

ముర్షిదాబాద్, ఉత్తర బెంగాల్, మాల్దా, బీర్భూమ్, ఉత్తర దినాజ్‌పూర్, అసన్సోల్, కోల్‌కతా వంటి కీలక ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు. మొదటి భారీ సభ ఏప్రిల్ 1న బెహ్రాంపూర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు ఓవైసీ హాజరవుతారని చెప్పారు. నా అన్న చెప్పే ప్రతి నిర్ణయాన్ని నేను అనుసరిస్తాను. ఈ కూటమి ఎప్పటికీ విడిపోదు అని కబీర్ స్పష్టం చేశారు. ఈ కూటమి కేవలం 2026 ఎన్నికలకే కాకుండా భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని తెలిపారు.

Also Read:KTR:డీలిమిటేషన్‌ను స్వాగతిస్తున్నాం..కానీ!

ఈ కూటమిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ స్పందిస్తూ..ఇది మంచిది కాదు. ఇలాంటి కూటములు ముస్లిం ఓట్లను విభజించి, సెక్యులర్ పార్టీలకు నష్టం కలిగిస్తాయి అని వ్యాఖ్యానించారు.

- Advertisement -