కోళ్ల నుంచి మనుషులకు వైరస్‌.. తొలి కేసు అక్కడే..!

110
H5N8 bird flu

కరోనా వైరస్‌తో ఇప్పటికే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పుడు మరో మహమ్మారి ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకూ ఎన్నో దేశాల్లో వ్యాపించి, కోట్లాది పక్షులను బలిగొన్న బర్డ్ ఫ్లూ మొట్టమొదటి సారిగా మనుషులకు సోకింది. రష్యాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకింది. ఈ విషయాన్ని అధికారికంగా నిర్దారించిన రష్యా శాస్త్రవేత్తలు, ఇన్ ఫ్లూయెంజా ఏ వైరస్ లోని హెచ్5ఎన్8 రకం తొలిసారిగా మానవునిలో కనిపించిందని, వెంటనే ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు తెలియజేశామని పేర్కొంది.

రష్యాలోని ఓ పౌల్ట్రీ కోళ్లలో కొత్త రకం H5N8 స్ట్రెయిన్‌ వైరస్ బయటపడింది. పౌల్ట్రీలో పనిచేసే ఏడుగురిలో ఈ కొత్త వైరస్‌ను గుర్తించారు. కోళ్ల నుంచి మనుషులకు వైరస్‌ సోకిన తొలి కేసుగా ఈ ఘటన నిలిచిందని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారి అన్నాపొపొవా వెల్లడించారు. కోళ్లను ప్రత్యక్షంగా తాకడం ద్వారా, అపరిశుభ్ర వాతావరణంలో ఉండటం వల్ల ఈ వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని అన్నారు.