- Advertisement -
వుల్వరైన్ సిరీస్‌లో భాగంగా మూడవ చిత్రంగా డెడ్‌పూల్-3గా హ్యూ జాక్‌మన్ నటిస్తున్నారని రేన్ రేనాల్డ్స్ ప్రకటించారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌ల్ దీనిని తొలిసారి తెరకెక్కనుంది. వుల్వరైన్ సిరీస్‌లో ఇది మూడవ చిత్రంకాగా…అంతకుముందు వచ్చిన లోగాన్‌ను కూడా మార్వెల్ యూనివర్సల్ నిర్మించింది.
2017లో వచ్చిన లోగాన్ చిత్రం తర్వాత మళ్లీ డెడ్‌పూల్-3లో నటిస్తున్న హ్యూ తిరిగి వుల్వరైన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి షాన్‌లెవీ దర్శకత్వం వహించనున్నారు. వుల్వరైన్ యొక్క పునరాగమనాన్ని కూడా సూచిస్తూ చిత్రయూనిట్ లోగో ను విడుదల చేశారు. రేన్ రేనాల్డ్స్ ఈ సినిమాకు సంబంధించిన విషయాలను వివరిస్తూ…సెప్టెంబర్6 2024లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
- Advertisement -