- Advertisement -
భారీ వర్షాలకు నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు వరద పోటెత్తగా గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో డ్యామ్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.
ప్రాజెక్టు ఇన్ ఫ్లో: 2,01,743 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో: 41,497 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం: 590.00 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం: 587 అడుగులుగా ఉంది.
Also Read:ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి: పొన్నం
మరోవైపు శ్రీశైలం ఎగువన ఉన్న తుంగభద్ర, జూరాల ప్రాజెక్టుల గేట్లను ఎత్తారు అధికారులు. 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 883 అడుగులకు చేరింది.
- Advertisement -

