భారీ వర్షాలు..కృష్ణమ్మ పరవళ్లు, మేడిగడ్డకు జలకళ

30
- Advertisement -

భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జురాల ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోగా సందర్శకులు పోటెత్తారు. జురాల నుండి శ్రీశైలంకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.  ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్‌కు జలకళ సంతరించుకుంది. భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.

ఇవాళ, రేపు రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్‌లో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, ఖమ్మం,కొత్తగూడెం, నిర్మల్ జిల్లాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ఈ 11 జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలన్నారు.

ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారగా దిశగా పయనించి ఈరోజు పూరీ సమీపంలో తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వాయుగుండం తీరే దాటే క్రమంలో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

Also Read:స్కిన్ అలర్జీ..అయితే జాగ్రత్త!

- Advertisement -