గోదావరికి పోటెత్తిన వరద..విహార యాత్రకు బ్రేక్

4
- Advertisement -

భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పాపికొండలు విహార యాత్రకు బ్రేక్ పడింది. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది గోదావరి. దీంతో పాపికొండలు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు.

మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ప్రవాహం ఉంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8,19,500 క్యూసెక్కులుగా ఉంది. 85 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కాళేశ్వరం త్రివేణి సంగమం జ్ఞాన సరస్వతి పుష్కరఘాట్ వద్ద జ్ఞానదీపాలు నీట మునిగాయి.

ములుగు రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 13.990 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహం ఉండగా పేరూరు వద్ద 14.440 మీటర్ల ఎత్తులో గోదావరికి వరద కొనసాగుతోంది. ములుగు జిల్లాలో మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో వరద ఉధృతి ఉంది.

Also Read:కాంగ్రెస్..కవర్ పాయింట్ ప్రజెంటేషన్

తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,42,150 క్యూసెక్కులుగా ఉండగా 59 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

- Advertisement -