శ్రీశైలం,సాగర్‌లకు పోటెత్తిన వరద

5
- Advertisement -

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నవర్షాల ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాజెక్టులు ఉత్సాహభరితంగా ప్రవహిస్తున్నాయి.శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు వరద పోటెత్తింది.ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 1,99,714 క్యూసెక్కులు ఉండగా,ఔట్‌ఫ్లో 1,00,800 క్యూసెక్కులుగా ఉంది.

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 35 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 881.20 అడుగులుగా ఉంది.పూర్తి నీటినిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 194.30 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.

Also Read:TTD:16న గోకులాష్టమి వేడుకలు

నాగార్జునసాగర్‌కు వరద పోటెత్తింది. ప్రాజెక్టులో 8 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 64,465 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం కూడా అదే స్థాయిలో నీరు నిల్వగా ఉంది.

- Advertisement -