శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్

42
- Advertisement -

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మద్యాహ్నం నుంచి గంటలపాటు రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు దోర్నాలకు వెళ్లె ఘాట్ రోడ్డులో అరు కిలోమీటర్ల మేరా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు.

వరుస సెలవులు ఉండడంతో తెలంగాణ, ఆంద్రాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వాహనాలు తరలివచ్చారు భక్తులు. శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వచ్చి వెళ్లె వాహనాలు భారీగా నిలిచిపోయాయి. శ్రీశైలం నుండి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖద్వారం నుండి శ్రీశైలానికి సుమారు 3 గంటల సమయం పడుతుండగా ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్స్ తో అష్టకష్టాలు పడుతున్నారు.

Also Read:ప్రజా దర్బార్ పొమ్మంటే..తెలంగాణ పార్టీ ఆదుకుంది

- Advertisement -