సొంతూళ్లకు జనం..బారులు తీరిన వాహనాలు

33
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోగా పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరడంతో టోల్ గేట్ల దగ్గర రద్దీ నెలకొంది. శుక్రవారం పండగ సెలవులు కావడంతో ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. చౌటుప్పల్‌ ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు పలు కూడళ్ల దగ్గర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇక పతంగి వద్ద టోల్ దాటేందుకు పది నిమిషాల సమయం పడుతోంది. ఇక వాహనదారులు వేగంగా వెళ్లకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు పోలీసులు. పంతంగి, కొర్లపహాడ్, మాడ్గులపల్లి వద్ద వాహనాలు నిలిచిపోకుండా ఏర్పాట్లు చేశారు.

సెలవు రోజుల్లో సంక్రాంతి పండగ రావడంతో పట్నం ఖాళీ అయి పల్లెకు వెళ్తోంది. ఇప్పటికే మెజార్టీ ప్రజలకు సొంతూళ్లకు చేరిపోగా ఈ రెండు రోజుల్లో మరింత మంది వారి వారి ఊర్లకు వెళ్లే అవకాశం ఉంది.

Also Read:బాలయ్య సినిమా వర్కౌట్ అవుతుందా?

- Advertisement -