శ్రీశైలం ఆలయం ఆధ్యాత్మిక సోభ సంతరించుకుంది. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శ్రీశైలంకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శివనామస్మరణతో శ్రీగిరులు మార్మోగిపోతున్నాయి. వేకువజామునుండే పుణ్యనది స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు భక్తులు. సాయంత్రం పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం జరగనుంది.
భక్తులు ముత్తైదువ మహిళలు భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్లకింద నాగులకట్ట వద్ద కార్తీక దీపాలు వెలిగించి భక్తీ శ్రద్ధలతో కార్తీక నోములు నోచుకుంటున్నారు. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసాన్ని పురస్కరించుకొని భక్తులు కార్తీక దీపారాధనలు, అభిషేకం, అర్చనలతో ఆరాధిస్తున్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయం క్యూలైన్లు భక్తులతో నిండిపోయింది.
భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ వేళల్లో అధికారులు మార్పులు చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి, మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, మహామంగళహారతి అనంతరం 4 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు.