జనసంద్రంగా రాజన్న సన్నిధి

150
Vemulawada temple
- Advertisement -

దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజన్నను దర్శించుకొని తరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువ ఉండడంతో గర్భాలయ ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేశారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో కోడెమొక్కులు చెల్లించుకునేందుకు రెండు నుంచి మూడు గంటలు, స్వామివారి దర్శనానికి రెండు గంటల మేరకు సమయం పట్టింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను నియంత్రిస్తూ ఏర్పాట్లు చేశారు.

- Advertisement -