- Advertisement -
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతో కొండపై రద్దీ కనిపిస్తోంది. క్యూలైన్‌లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో క్యూలైన్లు రాంభగీచ వరకు చేరుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,949 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 39,837 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు వచ్చింది.
టీటీడీ చరిత్రలో తొలిసారి మే నెలలో రికార్డు స్ధాయిలో హుండీ ఆదాయం ద్వారా భక్తులు స్వామి వారి కానుకలు సమర్పించారు. మే నెలలో 22 లక్షల అరవై రెండు వేల మంది భక్తులు స్వామి వారి దర్శనం కల్పించారు. హుండీ కానుకల ద్వారా రూ.130 కోట్ల 29 లక్షలు భక్తులు కానుకగా స్వామి వారికి సమర్పించారు. అలాగే కోటి 86 లక్షల స్వామి వారి లడ్డూ ప్రసాదం మే నెలలో విక్రయించారు.
- Advertisement -