శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు..

209
ttd
- Advertisement -

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,203 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,100 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండి ద్వారా రూ. 3.91 ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా రెండు రోజులు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25న సూర్య గ్రహణం కారణంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల 30 నిమిషాల వరకు ఆలయం మూసివేస్తున్నట్లు తెలిపారు. గ్రహణం రోజుల్లో వీఐపీ బ్రేక్, శ్రీవాణి, రూ.300 దర్శనాలు, ఆర్జిత సేవలు, అన్నీ రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశారు.

- Advertisement -