మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా రాష్ట్రంలోని పలు ఆలయాలకు పోటెత్తారు భక్తులు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. ఇక రాష్ట్రంలో ప్రసిద్ద ఆలయాలయినటువంటి వేములవాడ రాజన్న ఆలయం, యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఆలంపూర్ ఆలయాల్లో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
భక్తుల రద్దీ దృష్టా అన్ని ప్రధాన ఆలయాల్లో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు అధికారులు. అటు కీసర, చిలుకూరు బాలాజి టెంపుల్ లలో కూడా తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. ఆలయానికి వచ్చే వారి కోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రవాణా సౌకర్యం కోసం ప్రత్యేకమైన బస్సులను కూడా ఏర్పాటు చేశారు.
కీసరలో ప్రత్యేక పూజలు చేశారు ఎంపీ సంతోష్ కుమార్. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్ గాం శివ మల్లన్న ఆలయంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు. ఇక, నిజామాబాద్ జిల్లాలో శివరాత్రిని పురస్కరించుకుని భక్తులతో నగరంలోని శివాలయాలు కిటకిటలాడుతున్నాయి.. జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు.