వైకుంఠ ద్వార దర్శనం..కిక్కిరిసిన ఆలయాలు

31
- Advertisement -

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం 1.45 గంటలకు తెరుచుకోవడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

భక్తుల రద్దీతో తిరుమల కిక్కిరిసిపోగా అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. అంచనాలకు మించి భక్తులు వస్తుండటంతో టోకెన్లు లేనివారిని క్యూలైన్లలోకి టీటీడీ అధికారులు అనుమతించడం లేదు. ఇక ఇవాళ 80 వేల మందికి శ్రీవారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ.

జనవరి 1 వరకు అంటే పది రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనం కల్పించనున్నారు. కాగా, ఈ నెల 27న వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆఫ్‌లైన్‌ టికెట్లు శుక్రవారం మధ్యాహ్నం నుంచి పంపిణీ చేస్తామని అధికారులు ముందుగా ప్రకటించడంతో భక్తులు గురువారం సాయంత్రం నుంచే భారీ సంఖ్యలో క్యూ కట్టారు.

Also Read:గుంటూరు కారం కోసం శ్రీలీల వంతు!

- Advertisement -