వైన్ షాప్ టెండర్లకు అనూహ్య స్పందన..

48
- Advertisement -

రాష్ట్రంలో వైన్ షాప్ టెండర్లకు అనూహ్య స్పందన వచ్చింది. ఇవాళ టెండర్ దాఖలుకు చివరి తేదీ కావడంతో పెద్ద ఎత్తున టెండర్లు దాఖలు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు 107016 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

సరూర్ నగర్ ఎక్సైజ్ యూనిట్‌లో అత్యధికంగా 8883 దరఖాస్తులు రాగా 8749 దరఖాస్తులతో శంషాబాద్ రెండో స్ధానంలో ఉంది. గురువారం ఒక్క రోజే 3,140 దరఖాస్తులు రావడం గమనార్హం.

ఈ నెల 21న డ్రా పద్ధతిలో వైన్ షాపులను కేటాయిస్తారు. ప్రస్తుతం ఉన్న వైన్ షాపుల గడువు ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో వైన్ షాపులకు కొత్త లైసెన్సుల కోసం ప్రభుత్వం మూడు నెలల ముందుగానే టెండర్లు ఆహ్వానించింది.

Also Read:అప్పుడు బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్!

- Advertisement -