స్కైలాబ్ ఫస్ట్‌ లుక్‌కి విశేష స్పందన..

29

స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధానపాత్రలో డా. రవికిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వ‌క్ కందెరావ్‌ దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్‌’. నిత్యామీనన్‌ సహనిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రం 1979లో సాగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కగా ఆదివారం విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన వచ్చింది.

స్కైలాబ్ పై సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణతో పాటు మరికొందరు కూర్చుని ఉన్నారు. వీరి చుట్టూ డబ్బులు ఎగురుతున్నాయి. అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి బిగపట్టి ఎదురుచూడసాగారు.