శశివదనే సాంగ్‌కు మంచి రెస్పాన్స్

26
- Advertisement -

“నా దిల్లే నీ వల్లే
టూరింగు టాకీసులా మారెనే
నా కల్లో నీ బొమ్మనే
షో మీద షో వేసి చూపించనే
డీజే పిల్లా ఎదలో ఇల్లా
విజిలే వేసి బీటే కొట్టగా ..”

అని కుర్రాడు తన ప్రేయసి తన మనసులోని ప్రేమను పాట రూపంలో చెప్పేస్తున్నాడు. ఇంతకీ అబ్బాయి, అమ్మాయి మధ్య ఎందు ప్రేమ పుట్టింది. వారి ప్రేమ మజిలీ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ‘శశివదనే’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించారు. ‘డీజే పిల్లా..’ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యాన్ని అందించగా వైషాగ్ పాటను పాడారు. శరవణ వాసుదేవన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి ‘డీజే పిల్లా..’ పాటను విడుదల చేశారు. గౌరి నాయుడు సమర్పణలో ఎ.జి.ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్ పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌లో అంద‌మైన ప్రేమ‌క‌థ‌గా దీన్ని రూపొందిస్తున్నారు.

ఈ సందర్భంగా…చిత్ర నిర్మాతలు అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ “మా ‘శశివదనే’ సినిమా విడుదలకు సన్నద్ధమవుతుంది. హార్ట్ టచింగ్ లవ్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కింది. మంచి లవ్ మూవీ వచ్చి చాలా రోజులువుతుందని అందరూ అనుకుంటున్నారు. వారి కోరిక ఈ సినిమాతో తీరుతుందని అనుకుంటున్నాను. మా మీరో రక్షిత్, హీరోయిన్ కోమలి ప్రసాద్ సినిమాలో అలా ఒదిగిపోయారంతే. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం అన్నారు.

Also Read:ఉదయాన్నే తలనొప్పి వస్తే..ఇలా చేయండి!

- Advertisement -