ఆకట్టుకుంటున్న రోటి క‌ప‌డా రొమాన్స్

33
- Advertisement -

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఏప్రిల్ 12న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం అన్నారు.

ఈచిత్రానికి సంబంధించి ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్ర‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం ఎమోష‌న‌ల్ డోస్ ప్రీట్రైల‌ర్‌ను యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీ‌విష్ణు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నాకు ఈ బ్యాన‌ర్ ఎంతో ల‌క్కీగా ఫీల‌వుతాను. ఈ సంస్థ‌తో నాకున్న అనుబంధం గొప్ప‌ది. ఈటీమ్‌ను చూస్తుంటే నేను ఈ బ్యాన‌ర్‌లో చేసిన సినిమా రోజులు గుర్తుకు వ‌స్తున్నాయి. ఈ చిత్రం టీజ‌ర్‌, ఈ ఎమోష‌న‌ల్ టీజ‌ర్‌, పాట చూస్తుంటే యూత్‌కు బాగా క‌నెక్ట్ అయ్యే సినిమాలా అనిపిస్తుంది. ఈ సినిమా ఈ వేస‌వికి పెద్ద హిట్ అవుతుంద‌ని అనిపిస్తుంది అన్నారు.

అంద‌రూ ఏప్రిల్ 12న ఈ సినిమా ను చూసి ఈ సినిమాను ఆద‌రించాలి కోరుకుంటున్నాను. మ‌ళ్లీ స‌క్సెస్‌మీట్‌లో క‌లుద్దాం అన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ అంద‌రం క‌ష్ట‌ప‌డి ఈ ధైర్యంగా ఈ సినిమా చేశాం. కంటెంట్‌ను న‌మ్మి చేసిన సినిమా ఇది. అన్నారు. మ‌రో నిర్మాత సృజన్‌ కుమార్ బొజ్జం మాట్లాడుతూ క‌థ‌ను న‌మ్మి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేసిన సినిమా ఇది. అంద‌రూ ఎంజాయ్ చేసే కంప్లీట్ ఎమోష‌న‌ల్ విత్ ఫ‌న్ రైడ్ సినిమా ఇది అన్నారు. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ రెడ్డి మాట్లాడుతూ కొత్త వాళ్ల‌తో ఇలాంటి సినిమా తీయ‌డం ఓ మిరాకిల్‌. నా క‌థ‌ను న‌మ్మి ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌కు, నిర్మాత సృజన్‌ కుమార్ బొజ్జంకు నా థ్యాంక్స్‌. మాకు ఈ టైటిల్ ఇచ్చి ఎంక‌రైజ్ చేస్తున్న దిల్ రాజుగారికి కూడా రుణ‌ప‌డి వుంటాం అన్నారు.

Also Read:Rohith:రోహిత్ రిటైర్మెంట్ అప్పుడే!

- Advertisement -