నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది టీఆర్ఎస్. నోముల భగత్‌కు అడుగడున ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఆయా మండలాల్లో టీఆర్ఎస్ నేతలు ఇంటింటికీ తిరిగుతూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. త్రిపురారం మండలం నీలయ్యగూడెం, సత్యనారాయణపురం, అంజన పెళ్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, చిరుమర్తి లింగయ్య.
నిడమనూరులో గడప గడపకు గులాబీ జెండా పేరుతో మండల ఇంచార్జి ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, అరురి రమేష్ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు హాలియాలో ఇంటింటి ప్రచారంలో మున్సిపాలిటీ ఇంచార్జి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. అలాగే అనుముల మండలం యాచారం, శ్రీనాధపురం గ్రామాల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో అనుముల మండల ఇంచార్జి ఎమ్మెల్యే కోనేరు కొనప్ప పాల్గొన్నారు. పెద్దఊర మండల కేంద్రంలో మండల ఇంచార్జి ఎమ్మెల్యే విప్ బాల్క సుమన్ ప్రచారం నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని… నోముల భగత్ విజయం ఖాయం అని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు. నాలుగు దశాబ్దాలుగా నాగార్జునసాగర్ గోస పడిందని… 2014 తరువాతే ఇక్కడి ప్రజలకు అభివృద్ధి అంటే అర్థం అయిందని ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు గులాబీ నేతలు.