‘మై డియర్ దొంగ’కు అద్భుతమైన రెస్పాన్స్

11
- Advertisement -

సక్సెస్‌ఫుల్ చిత్రాలతో అలరిస్తున్న అభినవ్ గోమటం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. బీఎస్ సర్వాంగ కుమార్ దర్శకత్వం వహించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం‘ఆహా’లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

నిర్మాత మహేశ్వర్‌‌రెడ్డి మాట్లాడుతూ..‘‘మై డియర్ దొంగపై మొదటి నుంచి చాలా నమ్మకంగా వున్నాం. మా నమ్మకం నిజమైయింది. సినిమా చూసిన వారంతా గొప్ప అభినందిస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా అభినవ్ గోమటం నటనని ఆస్వాదిస్తున్నారు. పరిశ్రమ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా సినిమా చూడని ప్రేక్షకులు తప్పకుండా చూడండి. పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి’ అని కోరారు

యాక్టర్ నిఖిల్ మాట్లాడుతూ..‘‘ ఇది నా ఫస్ట్ రిలీజ్. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. అభినవ్, శాలిని తో వర్క్ చేయడం చాలా అనందంగా వుంది. ఈ సినిమా నాకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది’ అన్నారు.

యాక్టర్ స్నేహల్ మాట్లాడుతూ..‘‘ఈ సినిమా కంటెంట్ చాలా వైరల్ అయ్యింది. ఇందులో ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.

దర్శకుడు బీఎస్ సర్వాంగ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా మా అందరికీ గొప్ప అవకాశాలు తెచ్చిపెట్టింది. అభినవ్ గారు చాలా సపోర్ట్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ ఝాన్సీ గారు చాలా మంచి లుక్ తీసుకొచ్చారు. అజయ్ అర్సాడా మ్యూజిక్ తో సినిమాని ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. శాలిని మంచి రచయిత, నటి. వీరందరితో కలసి మళ్ళీ వర్క్ చేయాలని వుంది’ అన్నారు.

యాక్టర్ వంశీ మాట్లాడుతూ.. ఈ సినిమాకి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులు ధన్యవాదాలు. నాకు ఈ పాత్ర ఇచ్చిన శాలినికి ధన్యవాదాలు. టీం అందరికీ అభినందనలు’ తెలిపారు.

ఆహా మార్కెటింగ్ హెడ్ రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘మై డియర్ దొంగ’ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకుల మనసులో మంచి స్థానం సంపాయించుకుంది. ఇది బిగ్ స్మాల్ ఫిల్మ్. ఇప్పటివరకూ 25 లక్షల మంది చూశారు. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. మై డియర్ దొంగ రిటర్న్స్ కోసం ఎదురుచుస్తున్నాం’ అన్నారు.

ఆహా టీం నుంచి శ్రావణి మాట్లాడుతూ.. ఆహా లో కంటెంట్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మైడియర్ దొంగ చాలా మంచి టీం వర్క్ తో పాషన్ తో చేయడం జరిగింది. అభినవ్, శాలిని, టీం అంతా అద్భుతంగా చేశారు. మై డియర్ దొంగ విడుదలైనపటికీ నుంచి ఇప్పటివరకూ టాప్ ట్రెండింగ్ లో నడుస్తోంది. మీ అందరి సపోర్ట్ ఇలానే వుండాలి’ అని కోరారు.

హీరోయిన్, రైటర్ శాలినీ మాట్లాడుతూ..‘‘ ఈ సినిమాకి వచ్చిన రివ్యూస్, రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంత గొప్ప రెస్పాన్స్ ఊహించలేదు. ఆహ టీంకి ధన్యవాదాలు. ఇది బ్యూటీఫుల్ టీం వర్క్. పాషన్ తో ఒక కంటెంట్ ని హానెస్ట్ గా నమ్మి చేస్తే విజయం వస్తుందనిని చెప్పడాని ఇది ఉదహరణ. ఇంత గొప్ప రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులు ధన్యవాదాలు. దర్శకుడు కథని గొప్పగా అర్ధం చేసుకొని ఇంకా గొప్పగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమా రాయడం నాలో గొప్ప ఆత్మ విశ్వాసాన్ని నింపింది. అభినవ్ కి ధన్యవాదాలు. దివ్యతో పాటు ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా గురించి మరింత మందికి చెప్పాలని మీడియాని కోరుతున్నాను. అందరికీ రికమెండ్ చేసే చిత్రమిది. అందరూ ఎంజాయ్ చేస్తారు. మీ అందరి సపోర్ట్ మరింతగా వుండాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

హీరో అభినవ్ గోమటం మాట్లాడుతూ..‘‘ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా సినిమాని ఇంత చక్కగా ఆడియన్స్ ముందుకు తీసుకెలుతున్న మీడియాకి థాంక్స్. ప్రొడక్షన్, నటీనటులు, ఆహా.. ఈ మూడు టీములు మంచి సమన్వయంతో ఈ సినిమా చేయడం జరిగింది. తొలి సినిమాని ఇంత చక్కగా రాసిన శాలినికి అభినందనలు. తను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. వంశీ, శర్వాతో పాటు టీం అందరికీ థాంక్స్. మనోజ్ చక్కని విజువల్స్ ఇచ్చారు. ఆహా టీం అందరికీ ధన్యవాదాలు. అల్లు అరవింద్ గారికి ఈ ప్రాజెక్ట్ నచ్చడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంత మంచి సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’ తెలిపారు.

Also Read:రేవంత్‌పై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు

- Advertisement -