కరీంనగర్‌లో గులాబీ జోష్..

330
mp viond
- Advertisement -

కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది టీఆర్ఎస్‌. ఎంపీ అభ్యర్థి వినోద్ తరపున జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రచారం విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, వివిధ సంఘాల చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎక్కడిక్కడ హోరెత్తిస్తున్నారు.

మరోవైపు తనదైన శైలీలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఎంపీ వినోద్. నగరంలోని 44వ డివిజన్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌తో కలిసి ఇంటింటికీ వెళ్లి, ఓట్లు అడిగారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే కేంద్రం నుంచి భారీ నిధులు తెస్తాననీ, నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

కరీంనగర్‌లో తనను గెలిపిస్తే రాష్ట్ర హక్కులను సాధిస్తాననీ, కేంద్రం నుంచి భారీ నిధులు తీసుకవస్తాననీ వినోద్ కుమార్ తెలిపారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎంపీ వినోద్‌కుమార్ హామీ ఇచ్చారు. చిన్న రాష్ట్రాల అభివృద్ధి కోసం కాంగ్రెస్, బీజేపీలు చేసింది శూన్యమనీ, ప్రజా సంక్షేమం కోసం చెప్పుకునే స్థాయిలో ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేకపోయాయని విమర్శించారు.

విభజన అనంతరం తాము ఎంపీలుగా కేంద్రంలో అనేక పనులు చేపట్టేందుకు కృషి చేశామనీ, రాష్ట్ర హైకోర్టు విభజన కోసం ఎంతగానో శ్రమించామని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తేవడం వల్లే ఇప్పుడు రూ.70 వేల కోట్ల రుణాలు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు.

- Advertisement -