అన్నీ స్థానాల్లోనూ బి‌ఆర్‌ఎస్ హవా !

51
- Advertisement -

మహారాష్ట్రలో బి‌ఆర్‌ఎస్ రోజురోజుకూ వేగంగా బలపడుతోంది. అక్కడి స్థానిక పార్టీలకు సైతం గుబులు పుట్టించేలా బి‌ఆర్‌ఎస్ బలపడుతున్న తీరు అందరికి ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది. ఇప్పటికే ఇతర పార్టీలలోని చాలమంది బి‌ఆర్‌ఎస్ గూటికి చేరారు. ఇంకా రాబోయే రోజుల్లో చేరికలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇక బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ కూడా మహారాష్ట్ర పై స్పెషల్ ఫోకస్ పెట్టి వరుస పర్యటనలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ అక్కడి ప్రజలకు మరింత దగ్గర అవుతున్నారు. ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అక్కడి స్థానిక పార్టీలకు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఏదైనా ఒక కొత్త పార్టీ ఇతర రాష్ట్రాలలో బలపడాలంటే చాలా సమయం పడుతుంది.

ఎందుకంటే అక్కడి ప్రజల అభిప్రాయాలను, విధానాలను అంచనా వేసి బలపడడం అంతా తేలికైన విషయం కాదు. అంతే కాకుండా అక్కడి స్థానిక పార్టీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. వీటన్నిటిని దాటుకొని బలం చాటుకోవడం అంటే కత్తిమీద సాము అనే చెప్పాలి. అయితే మహారాష్ట్రలోని బి‌ఆర్‌ఎస్ విషయంలో ఇవేవీ పని చేయలేదనే చెప్పాలి. జాతీయ పార్టీగా ప్రకటించిన కొద్ది రోజులకే బి‌ఆర్‌ఎస్ పార్టీ పై మహారాష్ట్రలో మంచి సానుకూలత ఏర్పడింది. ఎందుకంటే తెలంగాణకు పొరుగు రాష్ట్రం కావడంతో తెలంగాణలో కే‌సి‌ఆర్ చేసిన అభివృద్ది ఎలాంటిదో మహారాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు.

Also Read: పొంగులేటికి గుణపాఠం తప్పదా ?

అందుకే బి‌ఆర్‌ఎస్ జాతీయపార్టీ గా అవతరించిన కొద్ది రోజులకే మహారాష్ట్రలో అందరి దృష్టి బి‌ఆర్‌ఎస్ పై పడింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో గ్రామస్థాయిలో కూడా బి‌ఆర్‌ఎస్ ప్రభావం కనిపిస్తుండడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ కు లభిస్తున్న ఆధరణ చూసి ఆ రాష్ట్రంలోని 288 నియోజిక వర్గాలన్నిటిలో ఏకకాలంలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించింది. సభ్యత్వ నమోదు కోసం వెళ్ళిన బి‌ఆర్‌ఎస్ బృందాలకు అక్కడి స్థానిక ప్రజల నుంచి ఘన స్వాగతం లభిస్తుందని బి‌ఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. దీన్ని బట్టి ఆ రాష్ట్ర ప్రజలు బి‌ఆర్‌ఎస్ పై ఎంత సానుకూలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

Also Read:నిద్ర లేమితో నష్టాలు..

- Advertisement -