Budget 2024:మోడీ చివరి బడ్జెట్..భారీ ఆశలు

34
- Advertisement -

ఎన్డీయే 2 చివరి బడ్జెట్‌ని ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది ప్రధానమంత్రి మోడీ సర్కార్. ఎల్లుండి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌. ఎన్నికల ఏడాది కావడంతో ప్రజాకర్షక నిర్ణయాలు ఉంటాయని అంతా కోటి ఆశలు పెట్టుకున్నారు.

వేతన జీవులే కాదు.. ఈ బడ్జెట్‌లో రైతన్నలకూ పెద్ద పీట వేస్తారని భావిస్తున్నారు. రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని తీసుకురాగా ఈసారి దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఆకట్టుకునేలా ఈ పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని పెంచుతూ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే జాతీయ పింఛను పథకం పరిమితిని కూడా పాత, కొత్త పన్ను విధానాలు రెండింటిలోనూ రూ.లక్షకు పెంచే అవకాశం ఉందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. పర్యావరణ కాలుష్యాన్ని కాపాడే ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఫేమ్‌) 3ని ప్రకటించే అవకాశం ఉంది.

జీవిత బీమా ప్రీమియంలపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలనే డిమాండ్ ఉండగా దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉత్పత్తి రంగాలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. పన్ను మినహాయింపులో భాగంగా సెక్షన్‌ 80సీ కింద ఇస్తున్న మినహాయింపు పరిమితి పెంపు రూ.లక్ష కాగా దానిని రూ. 2 లక్షలకు పెంచే అవకాశం ఉంది.

Also  Read:KTR:కోమటిరెడ్డిపై కేటీఆర్ ఫైర్

- Advertisement -