2024-25 మధ్యంత బడ్జెట్‌కు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 1న లోక్ సభలో ఆరోసారి బడ్జెట్‌ని ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. ఎన్నికల సందర్భంగా వస్తున్న బడ్జెట్ కావడంతో భారీ ఆశలు నెలకొన్నాయి. మధ్యంతర బడ్జెట్‌లో శ్రామిక ప్రజలు, మధ్యతరగతి వర్గాలకు ఆదాయపు పన్ను విషయంలో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
మహిళలకు ప్రత్యేకంగా పన్ను మినహాయింపు ఇచ్చే ఛాన్ ఉందని తెలుస్తోంది. మధ్యంతర బడ్జెట్ కాబట్టి ఆదాయపు పన్ను విషయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని పెంచడం ద్వారా కొంత ఉపశమనం లభించచే అవకాశం ఉంది.
ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50,000 మినహాయింపు ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్ కావడంతో ఓట్లను ఆకర్షించేందుకు కొన్ని రాయితీలు కల్పించే ఛాన్స్ ఉంది.
Also Read:Republic Day:తెలంగాణ శకటం