డోనాల్డ్ ట్రంప్‌కు మస్క్ భారీ విరాళం

33
- Advertisement -

అమెరికా ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది.మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి పోటీ చేస్తుండగా ఆయన పార్టీకి భారీ విరాళాన్ని అందజేశారు బిలియనీర్ ఎలాన్ మస్క్.

ట్రంప్ త‌ర‌పున ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న అమెరికా ప్యాక్ అనే కంపెనీకి మ‌స్క్ భారీ స్థాయిలో విరాళాలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ సంస్థ మాత్రం ఈనెల లోనే డోనార్ల జాబితాను రిలీజ్ చేయ‌నుండటంతో మస్క్ ఎంత డొనేషన్ ఇచ్చారనేది తెలియనుంది.

రిప‌బ్లిక్ పార్టీ అభ్య‌ర్థిగా వ‌చ్చే వారం డోనాల్డ్ ట్రంప్‌ను నామినేట్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రసంగాల్లో నోరు జారుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

Also Read:Sachin:అండర్సన్‌కు విషెస్ చెప్పిన సచిన్

- Advertisement -