శబరిమలకు పోటెత్తిన భక్తులు..

0
- Advertisement -

శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు శనివారం భక్తులుపోటెత్తుతున్నారు.కేరళ రాష్ట్ర వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా శబరిమలకు చేరుకుంటున్నారు.దీంతో పంబ నదితోపాటు ఆలయ క్షేత్రం ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అంటూ నామస్మరణతో మారుమోగింది.

అయ్యప్ప స్వామి ఆలయంతో పాటు ఎక్కడ చూసిన భారీగా రద్దీ భక్తులతో నెలకొంది.శబరిమల అయ్యప్ప క్షేత్రంలో ఈనెల భక్తులకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తూ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయంతీసుకుంది.నెల దర్శనం,నక్షత్ర దర్శనాల కోసం అయ్యప్ప భక్తులు ముందుగా టికెట్లు బుక్ చేసుకుని భారీగా తరలివచ్చారు.

అయితే భారీగా వచ్చిన భక్తులతో రద్దీ నెలకొనడంతో 10 నుంచి 12 గంటల వరకు క్యూలైన్లలోనే అయ్యప్ప స్వాములు పడిగాపులు కాస్తున్నారు.అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులను అధికారులు ఒకరి తరువాత ఒకరికి క్యూ లైన్ లో అనుమతిస్తున్నారు.క్యూలైన్ల లో అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మణికంఠ,కన్నె,గంటా,కత్తి స్వాములు ఆకర్షణంగా నిలిచారు.గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నా భక్తులకు తాగునీరు,మౌలిక వసతులు దేవస్థానం అధికారులు కల్పించారు.

Also Read:కాంగ్రెస్ అంటేనే చీటింగ్ : ఆర్ఎస్ ప్ర‌వీణ్

- Advertisement -