శ్రీశైలంకు పోటెత్తిన భక్తులు

45
- Advertisement -

శ్రీశైల మహా క్షేత్రానికి పోటెత్తారు భక్తులు. తెలంగాణ ఆంధ్రతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శివనామస్మరణతో మారుమోగుతోంది శ్రీశైలం. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు.

వేకువ జాము నుంచి పాతాళ గంగ లో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీకదీపాలు వెలిగిస్తున్నారు భక్తులు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం క్యూ లైన్లలో భారీ సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి ఐదు నుంచి ఆరు గంటలు సమయం పడుతోండగా క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం, పాలు అందిస్తోంది దేవస్థానం. భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు దేవాలయ అధికారులు.

Also Read:Gold Rate:లేటెస్ట్ ధరలివే

- Advertisement -