ఓవర్సీస్‌లో ‘సామజవరగమన’ అదుర్స్

45
- Advertisement -

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌ పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఫన్ టాస్టిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సామజవరగమన సత్తా చాటుతూ ఉండడం విశేషం. ఈ చిత్రం ఆల్రెడీ యూఎస్ లో 1 మిలియన్ మార్క్ కి చేరువ అవుతుండగా ఇక ఆస్ట్రేలియాలో మరింత డిమాండ్ ఏర్పడింది. ఆస్ట్రేలియాలో ఆడియెన్స్ డిమాండ్ మేరకి మరిన్ని స్క్రీన్స్ సహా షోస్ కూడా యాడ్ చేస్తున్నామని మేకర్స్ తెలిపారు.

Also Read:ఉదయాన్నే ఇవి తింటే ఎంత ప్రమాదమో..!

- Advertisement -