మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తన కొత్త చిత్రం #RT76 తో మరోసారి తన సిగ్నేచర్ ఎనర్జీతో అలరించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇటీవల పూజా వేడుకతో ప్రారంభమైయింది. ప్రేక్షకులను ఆకట్టుకునే హై ప్రొడక్షన్ వాల్యూస్ తో చిత్రాలను అందించే SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న #RT76 హ్యుమర్, ఎమోషన్స్ తో కూడిన హోల్సమ్ ఎంటర్ టైనర్ గా వుండబోతోంది.
ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర నాన్-థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది.
Also Read:వైసీపీ ఎంపీ బెయిల్ పిటిషన్ వాయిదా
ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జీ5 దక్కించుకోగా.. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు ఛానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నాన్-థియేట్రికల్ రైట్స్‌కు మంచి ఫ్యాన్సీ రేటు లభించినట్లు సినీ సర్కిల్స్ టాక్. రవితేజ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

