భారీ రేటుకు నాని ‘దసరా’!

119
nani
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ”దసరా” చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది.

ఈ చిత్రం కోసం నాని త‌న రెమ్యున‌రేష‌న్‌ను కూడా త‌గ్గించుకున్న‌ట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ సినిమా థియేట్రిక‌ల్ బిజినెస్ భారీ స్ధాయిలో జరిగినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.27 కోట్ల‌కు థియేట్రిక‌ల్ హ‌క్కులు అమ్ముడ‌య్యాయని సమాచారం.

ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నాని లుక్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు.

- Advertisement -