పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ఆగస్టు 25న సినిమా రిలీజ్ కానుండగా విజయ్ సరసన అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తుంది. కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయగా తాజాగా సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లైగర్‌కు భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరుగుతుండగా
ఈ సినిమాకు పాండమిక్ టైంలో ఓ భారీ ఆఫర్ వచ్చిందట. లైగర్ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దాదాపు రూ.200కోట్లు ఆఫర్ చేయగా మేకర్స్ ఈ ఆఫర్‌ను తిరస్కరించారట. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్‌గా మారగా ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.