లారెన్స్ సినిమా @ 6 కోట్లు!

50
- Advertisement -

లారెన్స్ నుండి హారర్ సినిమా వచ్చి చాలా నెలలవుతుంది. ఇక రొటీన్ హారర్ కామెడీ సినిమాలు చూడరు అనుకున్న టైమ్ లో కూడా లారెన్స్ ఈ జానర్ లో బ్లాక్ బస్టర్స్ కొట్టి మంచి వసూళ్లు రాబట్టాడు. అందుకే ఇప్పుడు లారెన్స్ కొత్త సినిమాకు తెలుగు డబ్బింగ్ రైట్స్ క్రేజీ గా సెల్ అయింది. ఈ సినిమాను పూర్వి పిక్చర్స్ తో కలిపి ఠాగూర్ మధు 6 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేశారట.

ఈ సినిమాకు లారెన్స్ డైరెక్టర్ కాదు, కథిరేషన్ దర్శకత్వం వహించాడు. హారర్ జానర్ లోనే వస్తున్న సినిమా ఇది. డిసెంబర్ నుండి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో 14 న రిలీజ్ కాబోతుంది. త్వరలోనే లారెన్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ రానున్నాడు. ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు.

మరి రుద్రుడు సినిమాతో లారెన్స్ బ్లాక్ బస్టర్ కొట్టి 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే తెలుగు నిర్మాతలు సేఫ్ అవుతారు. లేదంటే ఆరు కోట్ల కు పైగా కొని నష్టపోవల్సి వస్తుంది. సినిమా పై అంచనాలున్నాయి. లారెన్స్ ఓపెనింగ్స్ కూడా బాగానే తెచ్చుకునే ఛాన్స్ ఉంది. టాక్ బాగుంటే ఇక మంచి వసూళ్లు రావడం ఖాయం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -