జయమ్మ ప్రీ బిజినెస్‌ ఎంతో తెలుసా?

88
suma
- Advertisement -

టాలీవుడ్‌ పాపులర్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. ఈ సినిమా ఇవాళ మే 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.దర్శకుడు విజయ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది చిత్ర యూనిట్. సుమ అనే బ్రాండ్‌తో పాటు సినిమా కథను నమ్మి ఈ సినిమా రైట్స్‌ను మంచి రేటుకు సొంతం చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు.

జయమ్మ పంచాయితీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.3.45 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఒక చిన్న చిత్రానికి ఇది మంచి అమౌంట్ అనే చెప్పాలి. అయితే బ్రేక్ ఈవెన్‌కు రావడం మాత్రం అంత ఈజీ కాదు అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

నైజాం – 1.50 కోట్లు,సీడెడ్ – 0.50 కోట్లు,ఉత్తరాంధ్ర – 0.60 కోట్లు,ఈస్ట్ – 0.12 కోట్లు,వెస్ట్ – 0.10 కోట్లు,గుంటూరు – 0.18 కోట్లు,కృష్ణా – 0.15 కోట్లు,నెల్లూరు – 0.10 కోట్లు,ఏపీ+తెలంగాణ – 3.25 కోట్లు,రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్ – 0.20 కోట్లు,టోటల్ వరల్డ్ వైడ్ – రూ.3.45 కోట్లు వసూళ్లు చేసింది.

- Advertisement -