అల వైకుంఠపురములో డిస్ట్రిబ్యూటర్లకు షాక్..!

722
ala vaikunta puramlo
- Advertisement -

బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ అల వైకుంఠపురములో. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2020 సంక్రాంతి జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌,టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు పెరిగిపోయాయి.

తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చేసింది. సినిమాకు సంబంధించి థియేట్రికల్ రైట్స్‌ కోసం భారీగా డిమాండ్ చేస్తున్నారు హీరో అల్లు అర్జున్,నిర్మాతలు.

ఇప్పటికే నైజాం,సీడెడ్,ఓవర్‌సిస్ రైట్స్‌ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. రూ. 20 కోట్లకు నైజాం రైట్స్‌ను దిల్ రాజు దక్కించుకోగా ఓవర్‌సిస్ రైట్స్‌ను బ్లూ స్కై రూ. 8 కోట్లకు దక్కించుకుంది. ఇక అల్లు అర్జున్ కెరీర్‌లోనే సీడెడ్ రైట్స్‌ రూ. 12 కోట్లకు అమ్ముడుపోయాయి.

ఇక ఏపీలోని మిగిలిన జిల్లాలు, కర్ణాటక రైట్స్‌ కూడా భారీ ధరకే దక్కించుకునేందుకు పలువురు పోటీ పడుతుండటంతో డిస్ట్రిబ్యూటర్లు ఖంగుతింటున్నారు. సినిమా పాజిటివ్ టాక్ వస్తే ఓకే కానీ ఏ మాత్రం పొరపాటు జరిగిన భారీ నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానున్న ఈ మూవీ హిట్ కొడుతుందా లేదా వేచిచూడాలి.

‘Ala Vaikunthapuramlo’ starring Allu Arjun and Pooja Hegde in the direction of Trivikram is all set to hit the screens on January 12, 2020.

- Advertisement -