ఆ సినిమాతో వచ్చాయ్…ఈ సినిమాతో పోయాయ్

19
- Advertisement -

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్, రష్మికా మందన్న జంటగా వచ్చిన సినిమా యానిమల్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలు నడుమ భారీ వసూళ్లను రాబట్టింది. రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో నాలుగు రోజుల్లో 150 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను 25 మిలియన్ మేర స్ట్రీమింగ్ హావర్స్ ని ఈ మూవీ కంప్లీట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే యానిమల్ చిత్రం మరో రికార్డ్ కూడా సృష్టించింది. థియేటర్స్ లో సంచలన విజయం అందుకున్న ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓటీటీలో విడుదలై.. అక్కడా నెంబర్ వన్ సినిమాగా నిలిచింది.

పైగా మొదటి మూడు రోజుల్లోనే 62 లక్షల వ్యూస్‌తో పాటు.. 20.8 మిలియన్ల గంటల వ్యూయర్‌షిప్‌ను నమోదు చేసి సలార్ రికార్డును బ్రేక్ చేసింది. సలార్ మొదటి 10 రోజుల్లో 35 లక్షల వ్యూస్‌ సాధించింది. కానీ యానిమల్ మాత్రం కేవలం 3 డేస్ లోనే 62 లక్షల వ్యూస్‌తో పాటు.. 20.8 మిలియన్ల గంటల వ్యూయర్‌షిప్‌ను రాబట్టడం నిజంగా మిరాకిలే. ఇప్పట్లో ఈ రికార్డును బ్రేక్ చేసే మరో సినిమా లేదు. మొత్తంగా యానిమల్ రూపంలో నెట్ ఫ్లిక్స్ జాక్ పాట్ కొట్టింది. అయితే, నెట్ ఫ్లిక్స్ కి జనవరి నెలలో ఒక సినిమా ద్వారా భారీగా లాభాలు వస్తే.. మరో సినిమా ద్వారా భారీగా నష్టపోవాల్సి వచ్చింది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన నటనతో తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జనవరి నెలలో విడుదలైన ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగులో కూడా విడుదలై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. కాగా, గతంలో ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా పై ఆడియన్స్ ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. దీంతో నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా కారణంగా భారీ మొత్తాన్ని నష్టపోయింది. ఇక ఫిబ్రవరి 9 నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కానునట్లు టాక్. మొత్తానికి ఆ సినిమాతో వచ్చాయ్. ఈ సినిమాతో పోయాయ్ అన్నమాట.

Also Read:ఎన్టీఆర్ vs బన్నీ.. బిగ్ ఫైట్ ?

- Advertisement -