హగ్ మీ ప్లీజ్

334
Hug us to show acceptance
- Advertisement -

ప్రేమ అనేది మనసు,శరీరానికి చెందింది కాదని తమను ఓ సారి కౌగిలించుకుంటే ఏమీ కాదని హిజ్రాలు,గే,లేస్బియన్స్ వినూత్న ప్రచార కార్యక్రమం నిర్వహించారు. తమతో స్నేహం చేయాలంటూ మోబీరా ఫౌండేషణ్‌ ఆధ్వర్యంలో క్వీర్ కౌగిలి పేరుతో నెక్లెస్ రోడ్డులో ప్రచారం నిర్వహించారు.

అందరిలాగే మేము కూడా మనుషులమే.. మమ్మలను అందరితో సమానంగా చూడండని వారు పిలుపునిచ్చారు. మాతో మాట్లాడినంత మాత్రాన, మమ్మల్ని కౌగిలించుకున్నంత మాత్రాన ఏమీ కాదంటూ తెలిపారు. ఈ సందర్భంగా రేయిన్‌ బో ఫ్లాగ్‌ను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు.

Queer Hug

ఇటీవలె వయోజనుల మధ్య జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక చర్య చట్టబద్ధమేనని చారిత్రాత్మక తీర్పునిచ్చింది. దీంతో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసిన 25 దేశాల సరసన భారత్ చేరింది. స్వలింగ సంపర్కం నేరం కాదన్న సుప్రీంకోర్టు తీర్పు ఆ వర్గంలో ఆనందం నింపింది. దేశవ్యాప్తంగా స్వలింగ సంపర్కులు ఆనందంతో చిందులేశారు. సోషల్‌మీడియాలో ఎల్‌జీబీటీక్యూ వర్గానికి అభినందనలు వెల్లువెత్తాయి.

- Advertisement -