`జ‌వాన్‌`గా సాయి ధరమ్‌..

195
Jawaan Telugu Movie Teaser
- Advertisement -

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టాకీ పార్టు పూర్తిచేసుకుని షూటింగ్ చివరి షెడ్యూల్ కి సిద్ద‌మ‌వుతుంది. విడుద‌ల చేసిన ప్రీలుక్ పోస్ట‌ర్, టైటిల్ కి, మెద‌టి లుక్ పోస్ట‌ర్ కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. జ‌వాన్ అంటే అస‌లు ఏలాంటి క‌థ అనే చర్చ అటు అభిమానుల్లోను, ఇటు ప్రేక్ష‌కుల్లో ను ఆశ‌క్తి నెల‌కొంది.

Jawaan Telugu Movie Teaser

సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన `జ‌వాన్‌` సినిమా టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. `ఇంటికొక్క‌డు` అనే ట్యాగ్‌లైన్‌తో వ‌స్తున్న ఈ సినిమాలో సాయి మిల‌ట‌రీ సోల్జ‌ర్‌గా న‌టిస్తున్నాడు. సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న మెహ్రీన్ కౌర్ న‌టిస్తోంది. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చాడు. దేశ‌మా? కుటుంబ‌మా? అని తేల్చుకోవాల్సిన క్లిష్ట ప‌రిస్థితిలో త‌న దేశభ‌క్తిని ఒక సోల్జ‌ర్ ఎలా నిరూపిస్తాడ‌నే అంశం నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ నడ‌వ‌నుంది.

https://youtu.be/vL52jQd1-3o

- Advertisement -