ఆసక్తి రేపుతున్న సూప‌ర్ 30.. ఫస్ట్‌ లుక్

265
Hrithik Roshan
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ కాబిల్ సినిమా తర్వత చాలా గ్యాప్ తీసుకొని సూప‌ర్ 30 అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సూప‌ర్ 30 స్కూల్ ద్వారా ఎంతో మంది విద్యార్ధుల‌ని ఆనంద్ కుమార్ తీర్చిదిద్దారు. పాట్నాలో ఎక‌నామిక‌ల్ బ్యాక్ వ‌ర్డ్ సెక్ష‌న్‌కి చెందిన 30 విద్యార్ధుల‌ని సెల‌క్ట్ చేసి జేఈఈ తోపాటు ఐఐటీ ట్రైనింగ్ ఇచ్చాడు ఈ ప్ర‌ముఖ ఉపాధ్యాయుడు. ఎంద‌రికో స్పూర్తిని క‌లిగించిన ఆనంద్ కుమార్ బ‌యోపిక్ సూపర్ 30 చిత్రాన్ని వికాస్ బాహ్ల్ తెర‌కెక్కిస్తుండ‌గా, రిల‌యన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై రూపొందుతుంది.

Hrithik Roshan

అయితే నేడు ఉపాద్యాయ దినోత్సవం సందర్బంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. పోస్టర్ పై ‘అబ్ రాజా కా బేటా రాజా నహిన్ బనేగా’ అంటూ వేయడం చర్చనీయాంశం అవుతుంది. ఆ పదాలు సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంను 2019 జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -