- Advertisement -
బాలీవుడ్‌లోకి ఎన్టీఆర్ అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ ప్రధానపాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుండగా బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రానికి వార్ 2 అనే టైటిల్ ఖరారు చేశారు.
ఈ సినిమాపై భారీ హైప్ నెలకొనగా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హృతిక్ రోషన్. తన ఫేవరెట్ కో స్టార్ ఎవరు అంటే ఓ పబ్లిక్ ఈవెంట్ లో వెంటనే జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పారు.
తాను ఇప్పుడు వరకు బాలీవుడ్ లో ఎంతోమంది స్టార్స్ తో కలిసి పని చేయగా వారి పేరు కాకుండా ఎన్టీఆర్ పేరు చెప్పడం విశేషం. వార్ 2 ఆగస్ట్ 14న రిలీజ్ కానుండగా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read:SSMB29:పాస్ పోర్ట్ వెనక్కి ఇచ్చేసిన మహేష్!
- Advertisement -