ఐపిఎల్ లో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా ఆడి తనదైన ప్రతిభ కనబర్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హైదరాబాద్ ప్లేయర్ అంబటి రాయుడు. ఆడిన ప్రతి మ్యాచ్ లో తనదైన ప్రదర్శనను కనబర్చాడు. ఈసందర్భంగా ఐపీఎల్ మధ్యలో ‘క్విక్ హీల్ భజ్జీ బ్లాస్ట్ షో’లో రాయుడు పాల్గొన్నాడు. ఈషో లో తన ఆడిన తిరుపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ప్రతి సంవత్సరం ఐపిఎల్ లో నేను విరాట్ కోహ్లీ దగ్గర బ్యాట్ తీసుకోవడం ఆనవాయితిగా మారిందన్నాడు. కోహ్లీ బ్యాట్ తీసుకున్న ప్రతిసారి తాను ఎక్కువ పరుగులు చేస్తున్నానని చెప్పకోచ్చాడు.కోహ్లీ ఇస్తున్న బ్యాట్ తనకు ఎంతో కలిసివస్తుందన్నారు.
పోయిన సీజన్ లో ముంబై తరపున ఆడిన రాయుడు… ఈసిజన్ లో చైన్నై సూపర్ కింగ్స్ టీం అతన్ని రూ2.2కోట్లుకు కోనుగొలు చేసింది. ఆడిన ప్రతి మ్యాచ్ లో తనదైన ప్రదర్శనను కనబర్చి చైన్నై టీం ను విజయం వైపున తీసుకెళ్లాడు. చైన్నై తరపున ఆడిన 16 మ్యాచ్ లలో రాయుడు మొత్తం 602 పరుగులు చేశాడు. ఐపిఎల్ 11వ సిజన్ లో మొత్తం 602 పరుగులు సాధించాడు. ఐపిఎల్ 11వ సిజన్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నాల్గవ ప్లేయర్ గా నిలిచాడు.
ప్రతిసారి కోహ్లి ఇచ్చిన బ్యాట్ తో బాగా ఆడుతుండటంతో ఈసారి కోహ్లీని బ్యాట్ అడగ్గానే తిట్టుకుంటూ ఇచ్చాడని ఓ ఇంటర్యూలో చెప్పాడు రాయుడు. ఐపిఎల్ ఆరంభం నుంచి 10వ సిజన్ వరకూ రాయుడు ముంబై తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఈసీజన్ లో అతని చైన్నై టీం కొనుగొలు చేసింది. ఈసీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మూడో ఆటగాడిగా రికార్డు సాధించాడు. దేశవాళీ పర్యటనలో హైదరాబాద్ తరపున ఆడిన రాయుడు తనదైన ప్రదర్శనను కనబర్చాడు. అటు దేశవాళీ క్రికెట్ లో ఇటు ఐపిఎల్ లో మంచి ప్రదర్శన కనబర్చడంతో రాయుడుకు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేందుకు భారత జట్టులో అవకాశం కల్పించింది బీసీసీఐ.