విషపు పుట్టగొడుగులను గుర్తించడమెలా?

30
- Advertisement -

చాలమంది పుట్టగొడుగులను వండుకొని తింటూ ఉంటారు. వీటిని తినడం వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా మన శరీరానికి అవసరమైన మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం వంటి మూలకాలు కూడా మెండుగా ఉంటాయి. పొట్టగొడుగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయని నివేదికలు చెబుతున్నాయి. ఇంకా ఇందులో ఉండే లెంటిసియన్, ఎరిటాడేనిన్ ఆమ్లాలు రక్తంలోని కొవ్వును కరిగిస్తాయి. ఇంకా గుండె జబ్బులకు కూడా పుట్టగొడుగులు మెడిసిన్ గా పని చేస్తాయని ఆహార నిపుణులు చెబుతుంటారు. అందుకే ఆయా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పుట్టగొడుగులను తినాలని వైద్య నిపుణులు తరచూ సూచిస్తుంటారు..

అయితే పుట్టగొడుగుల్లో చాలానే రకాలు ఉన్నాయి. అందులో 90 శాతం విషపూరితమైనవి కాగా.. కేవలం 10 శాతమే తినదగినవిగా ఉన్నాయి. అందువల్ల పుట్టగొడుగులు తినే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఏవి పడితే అవి తినడం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే పుట్టగొడుగుల్లో విషపూరితమైన వాటిని గుర్తించడం చాలా కష్టం.

కానీ కొన్ని సంకేతాల ద్వారా విషపు పుట్టగొడుగులను గుర్తించవచ్చు. ముదురు పసుపు రంగు లేదా పసుపు రంగు, నీలి రంగు కలిగిన పుట్టగొడుగులు విషపూరితమైనవని చెబుతున్నారు నిపుణులు. ఇంకా దుర్వాసనతో కూడినవి కూడా ఏ మాత్రం తినకూడదు. విషపు పుట్టగొడుగులు తినడం వల్ల నాడీ వ్యవస్త్ఘ స్తంభిస్తుంది. అలాగే లివర్, కిడ్నీ వంటి అవయవాలపై ప్రభావం పడుతుంది. ఇంకా తిన్న వెంటనే వికారం, వాంతులు, కడుపులో నొప్పి, అవంతి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ లక్షణాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి పుట్టగొడుగుల విషయంలో జాగ్రత్త తప్పనిసరి.

గమనిక : ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి మీ అవగాహన నిమిత్తం అందించడం జరిగింది. కాబట్టి నిపుణుల సలహా మేరకు తుది నిర్ణయం తీసుకోవడం మంచిది.

Also Read:‘గుంటూరుకారం’ హిట్ అవ్వాలంటే?

- Advertisement -